ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రగ్బీ జట్టుకు సునంద తేజశ్రీ ఎంపిక

Jun 16,2024 16:34 #Kakinada, #spports

ప్రజాశక్తి-కాకినాడ :  అన్నవరం సత్యదేవ మహిళా కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్న గురజనాపల్లి గ్రామానికి చెందిన సునంద తేజశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రగ్బీ జట్టుకు ఎంపికైందని ప్రిన్సిపాల్ చింత సూర్యనారాయణ మూర్తి రాజు తెలిపారు. సునంద తేజశ్రీ రాష్ట్ర రగ్బీజక్టుకు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. మే 31 నుండి జూన్ 1వ తేదీ వరకు తిమ్మాపురం విశాఖపట్నంలలో జరిగిన జూనియర్ రగ్బీ ఛాంపియన్షిప్లో సునంద తేజశ్రీ తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొని జిల్లా జట్టును తృతీయ స్థానంలో నిలిపిందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సునంద తేజశ్రేణి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేశారన్నారు. జూన్ 19 నుండి 20 వరకు పూణేలో గల చత్రపతి శివాజీ స్టేడియంలో జరుగుతున్న ఆల్ ఇండియా జూనియర్ బాలికల రగ్బీ ఛాంపియన్ షిప్ లో సునంద తేజశ్రీ పాల్గొంటుందని తెలియజేశారు. సునంద తేజస్విని ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం, యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రసాదరావు తదితరులు అభినందించారు.

➡️