నిజాయితీపరుల్ని ఎన్నుకోండి : జెవివి

May 8,2024 00:39

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న లక్ష్మణరావు తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని, నిజాయితీ పరుల్ని ఎన్నుకోవాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు కెఎస్‌ లక్ష్మణరావు కోరారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించే వారిని, పర్యావరణాన్ని కాపాడే వారిని, ప్రజలకు స్వచ్చమైన తాగునీరు, కల్తీలేని ఆహారం అందించే వారిని, పౌరహక్కులు కాపాడే వారిని, ప్రజల మధ్య సామరస్య భావనను పెంపొందించే వారిని, జాతి సంపదని ప్రజలందరికీ సమానంగా అందేవిధంగా చూసేవారిని, ప్రజారవాణాను ప్రజలందరికీ అందుబాటులో ఉంచేవారిని, ఉపాధి చూపే వారిని, వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దే వారిని, మద్యం, డ్రగ్స్‌ నిషేధించే వారిని, శాస్త్రీయ ఆవిష్కరణలకు అత్యధిక నిధులు కేటాయించే వారిని, ప్రజల్లో మూఢనమ్మకాలను నిర్మూలించి, శాస్త్రీయ ధృక్పథం పెంపొందించే వారిని ఎన్నుకోవాలని లక్ష్మణరావు కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉండాల్సిన అంశాలపై కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెవివి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.జాన్‌బాబు, బి.ప్రసాద్‌, జి.వెంకటరావు, బి.శంకర్‌సింగ్‌, ఎం.ఉదరుభాస్కర్‌, బి.ప్రతాప్‌సింగ్‌, టి.ఆర్‌.రమేష్‌, ఎస్‌.కె.సుభాని పాల్గొన్నారు.

➡️