మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేకు సిఐటియు వినతి

చిత్తూరు : చిత్తూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కార్పొరేషన్‌ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని శనివారం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్‌ కి ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా గెలిచిన శాసనసభ్యులకు బకే ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎ.పి.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ …. చిత్తూరు కార్పొరేషన్‌ లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు సమస్యలు పరిష్కారం చేయాలని గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని వాటిపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలు పెంచడంతోపాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వినతిపత్రం తీసుకున్న శాసనసభ్యులు మాట్లాడుతూ … కార్మికుల సమస్యలు పరిష్కారానికి కఅషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి విజయ కుమార్‌ నాయకులు నాగరాజు, లోకనాథం, సుబ్రహ్మణ్యం, సాయి, భూపతి తదితరులు పాల్గొన్నారు.

➡️