నేడు క్రోసూరుకు సిఎం జగన్‌

May 2,2024 23:06

ప్రజాశక్తి – క్రోసూరు : పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరుకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వైసిపి అధినేత, సిఎం జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకరరావు, నాయకులు నంబూరు కళ్యాణ్‌ చక్రవర్తి గురువారం పరిశీలించారు. తొలుత జెడ్‌పి పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సిఎం చేరుకుంటారు. అనంతరం అందుకూరు సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ మేరకు ఏర్పాట్లను నాయకులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఏర్పాట్లు, పార్కింగ్‌కు సంబంధించి పలు సూచనలు చేశారు.

➡️