4న పలమనేరుకు సిఎం జగన్‌ రాక

May 2,2024 17:44 #ap cm jagan, #chitoor, #tour
  • ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అడిషనల్‌ ఎస్‌పి ఆరిపుల్లా ఖాన్‌

ప్రజాశక్తి పలమనేరు(చిత్తూరు) : సిఎం జగన్ శనివారం పలమనేరు రానున్న సందర్భంగా అడిషనల్‌ ఎస్‌పి, జిల్లా పోలీసు అధికారులు పలమనేరులో ఏర్పాట్లను పరిశీలించారు. ఎంబిటి రోడ్డులో గల రోడ్‌ షో స్థలాన్ని, అదేవిధంగా గంగవరం మండలంలో శ్రీ సాయి చైతన్య జూనియర్‌ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఎలిఫడ్‌ స్థలాన్ని కూడా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే వెంకట్‌ గౌడల, డి.ఎస్‌.పి మహేశ్వర్‌ రెడ్డి, సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ సహదేవి, శివశంకర్‌, గంగవరం మండల సిఐ చిన గోవిందు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చాముండేశ్వరి సుధాకర్‌, ఏఎంసీ చైర్మన్‌ హేమంత్‌ కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️