ఉపాధిహామీ కూలీలతో సిఎం రమేష్‌ కోడలు పూజిత భేటీ

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మండలంలో చింతలపాలెం నరసింగబిల్లి గ్రామాలలో ఉపాధి మహిళా కూలీలతో ఎంపి అభ్యర్థి సిఎం రమేష్‌ కోడలు సిఎం పూజిత బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పూజిత మాట్లాడుతూ … దేశంలో ఎక్కడలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కు చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2023) పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చట్టాన్ని తీసుకువచ్చారని జగన్మోహన్‌ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే మన భూములు కూడా మనకి కాకుండా పోతాయి అని రైతుల భూములను బలవంతంగా లాగేసుకుంటారని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక ఛాన్స్‌ ఒక్క ఛాన్స్‌ అంటూ సీఎం అయి వచ్చారని ఆ ఒక్క ఛాన్స్‌ తోటే మన రాష్ట్రం అధోగతి పాలు చేసి అప్పుల ఊబిలోకి నెట్టేశారని తెలియజేసారు. యువతకు ఉపాధి కల్పించాలని పరిశ్రమలు నిర్మించాలన్న మన రాష్ట్రం అప్పుల ఊబి నుండి బయటపడాలని మన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొణతాల రామకృష్ణ గుర్తు గాజు గ్లాస్‌ పైన ఎంపీ అభ్యర్థి అయిన సిఎం రమేష్‌ గుర్తు కమలం పువ్వు పైన రెండు ఓట్లు వేసి గెలిపించండి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్య దర్శి గొంతిని శ్రీనువాసరావు, పి అప్పారావు, ఉపాధి హామీ పథకం కూలీలు, మహిళలు పాల్గొన్నారు.

➡️