గ్రూప్‌ -2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌, జేసీ, పోలీస్‌ కమిషనర్‌

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : గ్రూప్‌ -2 పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున, జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం ఉడా పార్కు సమీపంలో ఉన్న గాయత్రీ విద్యాపరిషత్‌ ఎం.ఎల్‌.బి.టి. హైస్కూల్‌ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్‌ -2 పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అభ్యర్థుల సంతకాల రిజిస్టర్లను చూశారు. రోల్‌ నెంబర్‌ ప్రకారం సీటింగ్‌ అరేంజ్మెంటు జరిగిందా లేదా అనే అంశాలను పరిశీలించారు. పరీక్ష సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఇన్విజిరేట్లరకు సూచించారు. భద్రత ఏర్పాట్లు పరిశీలించిన నగర కమిషనర్‌ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 రాత పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నగర కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ డాక్టర్‌ ఏ.రవిశంకర్‌ స్వయంగా పరిశీలించారు. ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కాలేజ్‌, ఏ.వి.ఎన్‌.కాలేజ్‌, కొన్ని ఇతర కాలేజీలను సందర్శించి, పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సహకరించాలని అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు సహాయ సహకారాలు అందిచాలను ఆయన సిబ్బందికి సూచించారు.

➡️