అవసరం ఉంటేనే బయటికి రండి : ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు సందర్భంగా రేపు నార్పల మండలం మొత్తం నిఘానేత్రం నడుమున ఉంటుందని మండల కేంద్రంలోని పలు కూడలి ప్రాంతాల్లోనూ సమాసాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా అత్యవసరమైన పనులు ఉంటేనే బయటికి రావాలని ఎస్‌ఐ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ … గ్రామాల్లో గాని మండల కేంద్రమైన నార్పల్లో కానీ ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, కవ్వింపు చర్యలకు దిగినా, బాణసంచాలు కాల్చినా గుంపులు గుంపులుగా జనాలున్నా, సీసీ కెమెరాలలో రికార్డు అయి ఉంటుందని దాని ఆధారంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్‌ఐ అన్నారు. వ్యాపార సముదాయాలు నిబంధనల మేరకు తెలుసుకోవచ్చని అన్నారు. మండలంలో 144 సెక్షన్‌ 30 యాక్ట్‌ అమల్లో ఉంటుందని దుకాణాల వద్ద నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి కోరారు..

➡️