గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి

Jun 28,2024 19:55
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలి

కూలీలతో మాట్లాడుతున్న నాయకులుఅన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభించాలివ్య.కా.స. డిమాండ్‌ప్రజాశక్తి-విడవలూరు:జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ప్రారంభించాలని వ్య.కా.స. జిల్లా కార్యదర్శి మంగళపుల్లయ్య తెలిపారు. మండలంలోని అన్నా రెడ్డిపాలెం గ్రామంలో జరుగుతోన్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్‌ పూర్తయి మూడు నెలలు గడిచింది పనులు లేక కూలీలు అనే ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించి కూలీలను ఆదుకోవాలని కోరారు. ఇంకా అనేక మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించలేదని వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో చేసిన పనికి నాలుగైదు వారాలుగా కూలీల బకాయిలు ఉన్నాయన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, పేస్లిప్‌ లు ఇవ్వాలని, పని ప్రదేశాల్లో చట్ట ప్రకారంగా కల్పించాల్సిన వసతులు, మెడికల్‌ కిట్టు, తాగునీరు, నీడ కల్పించాలన్నారు.పనిలో జిపిఎస్‌ విధానాన్ని తీసివేయాలని, కూలీలకు మూడు కిలోమీటర్ల దాటితే రవాణా వసతి కల్పించాలని కోరారు. నిత్యావసర ధరలు పెరిగిన ఈ పరిస్థితుల్లో కూలీలకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని, రెండు వందల రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.కొత్తగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీకి నిధులు పెంచి ఉపాధి హామీ పనులు పటిష్టంగా చేయించి పేదలను ఆదుకోవాలన్నారు. ఆ దిశగా కొత్త ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా అధికారులు కూడా జిల్లాలో ఉపాధి హామీ పనులు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మోడేగుంట రామచంద్రయ్య, ,రైతు సంఘం మండల కార్యదర్శి మడపర్తి అంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️