మెటీరియల్‌ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్‌

ఏర్పాట్లపై సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్‌

 గుంటూరు:  గుంటూరు తూర్పు నియోజక వర్గానికి 13న జరిగే పోలింగ్‌కు సంబం ధించిన మెటీరియల్‌ పంపిణీకి స్థానిక ఏసీ కాలేజిలో ఏర్పాట్లు పూర్తి చేశామని నగర కమిషనర్‌, ఆర్‌ఒ కీర్తి చేకూరి తెలిపారు. నియోజకవర్గంలోని 255 పోలింగ్‌ కేంద్రాలకు అవసరమైన పోలింగ్‌ మెటీరియల్‌ను ఆదివారం ఉదయం 7 గంటల నుండే పంపిణీకి చర్యలు తీసు కుంటున్నామన్నారు. నగర కమిషనర్‌ శనివారం ఏసి కాలేజిలో పోలింగ్‌ మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ని పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది పిఓలు, ఏపిఓలు ఉదయం 7 గంటలకే ఏసి కాలేజిలో రిపోర్ట్‌ చేయాలన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రాలను 22 సెక్టార్లుగా విభజించి, ప్రత్యేకంగా అధికారులను కేటాయించామన్నారు. సెక్టార్‌ వారీగా టేబుల్స్‌, మెటీరియల్‌ ప్యాకింగ్‌కు తగిన ఏర్పాట్లు చేశా మన్నారు. పిఓలు రిపోర్ట్‌ చేసిన వెంటనే వారికి పిడిఎంఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌, లాగిన్‌ చేయడం, అటెండెన్స్‌ కోసం సిబ్బందిని, హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు.

➡️