మోటూరు ఉదయం ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ తరగతులు

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ఎంటిఎంసీ పరిధిలోని కొలనుకొండ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న మోటూరు ఉదయం (ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో) గురువారం ఉదయం కంప్యూటర్ శిక్షణ తరగతులను ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ప్రారంభించారు. 45 రోజులపాటు నేర్పించే, ఈ శిక్షణ తరగతులలో ఎంఎస్ ఆఫీస్, డిటిపి, టాలి వంటి కోర్సులు నామమాత్రపు ఫీజు 600 రూపాయలతో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వేసవి కాలం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వివరాలకు 9490099201, 9866466306 నంబర్ల కు సంప్రదించాలని అన్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో అమలాశ్రీ, శ్రీదేవి, కంప్యూటర్ శిక్షణ టీచర్ ఎస్.కె కాసిం తదితరులు పాల్గొన్నారు.

➡️