కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి మేలు

Apr 27,2024 21:06

ప్రజాశక్తి – జామి : కాంగ్రెస్‌తోనే రాష్ట్రానికి మేలు అని ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపిం చుకొని, ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఎస్‌కోట కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గేదెల తిరుపతిరావు పిలుపునిచ్చారు. శనివారం జామి దొండపర్తి జంక్షన్‌ నుంచి ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని ఎస్‌సి కాలనీ, బస్టాండ్‌, మాధవరాయ మెట్ట వరకూ నిర్వహించారు. అనంతరం ఉపాది హామీ పని ప్రదేశాల్లో పర్యటించి, కూలీలతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేస్తామ న్నారు. ఇంటింటికీ వెళ్లి హస్తం గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు డేగల అప్పలరాజు, శారదా, పాత్రుడు, జామి అధ్యక్షులు బోని అప్పారావుతో పాటు నాలుగు మండలాల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️