బాధిత కుటుంబానికి పరామర్శ

ప్రజాశక్తి -దర్శి : మండల పరిధిలోని తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన టిడిపి సానుభూతిపరుడు జంపాల గురుబాబు(28) అనే వ్యక్తి అనారోగ్యంతో ఈనెల 18న మృతిచెందాడు. అందులో భాగంగా టిడిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి మృతుడు గురుబాబు కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈ కారక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️