షీలానగర్‌లో సిపిఎం ప్రచారం

May 8,2024 00:15 #cpm pracharam
cpm pracharam

ప్రజాశక్తి -గాజువాక : ఇండియా ఫోరం బలపరిచిన సిపిఎం గాజువాక నియోజవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు మంగళవారం షీలానగర్‌, వెంకటేశ్వర కాలనీ, హరిజన జగ్గయ్యపాలెం ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ సిపిఎం అభ్యర్థిగా పోటీచేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా కాలనీ ముంపునకు గురయ్యేదన్నారు. సిపిఎం పోరాట ఫలితంగా షీలానగర్‌ ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారమైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ ప్రచారంలో సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు, ఎస్‌వి.కుమార్‌, వై.సత్యవతి, ఎస్‌.జ్యోతీశ్వరరావు, జీవీ రమణ, పి.వెంకటరెడ్డి, శ్రీదేవి, రమణమ్మ పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆటలు పాటలు అలరించాయి.

➡️