ఇండియా బ్లాక్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలంటూ… సిపిఎం ముమ్మర ప్రచారం

May 11,2024 13:01 #Campaigning, #cpm, #India Block

పెదబయలు (అల్లూరు) : ఓటువేసి గెలిపించాలని పనికి ఆహార పథకం కూలీలను సిపిఎం అభ్యర్థిస్తూ … అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో గల సీతగుంట, వనబంగి సేకరి, అరడకోట, పంచాయతీ పరిధిలో గల సీత గుంట రోగులపేట, పెదబయలు పన్నెడ, బంగారు మెట్ట, వనబంగి ,జాడిగూడ, ఎగబడమా, దిగబడమా, నిమ్మగుంట గ్రామాల్లో ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి అలాగే గ్రామాల్లో డోర్‌ టు డోర్‌ ఇండియా బ్లాక్‌ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పల నరసయ్య గెలుపు కాంక్షిస్తూ ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండా సన్నిబాబు మాట్లాడుతూ …. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటికే గిరిజన చట్టాలు హక్కులను రద్దు చేసిందన్నారు. అందులో భాగంగానే జీవో నెంబర్‌ త్రీ ని రద్దు చేసిందని తెలిపారు. నూతన అటవి పాలసీ తీసుకొచ్చి అడవులన్నీ ప్రైవేటుకి ధారదత్తం చేయాలని చూస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మూడవసారి తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తానని అంటుందని, అలాగే గిరిజనుల మధ్య చిచ్చుపెట్టి అధికారం కాజాయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి మతోన్మాద విచ్ఛిన్నకరమైన విధానాలు అవలంబిస్తున్న బిజెపిని రేపు 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని నిరంతరం ప్రజా సమస్యలపై కార్మికులు గిరిజనుల కోసం పోరాటం చేస్తున్న ఇండియా బ్లాక్‌ ఎంపీ అభ్యర్థి అయిన పాసిపెంట అప్పల నరసయ్య గుర్తు సుత్తి కొడవలి చుక్క గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సర్బన్న, బొండా గంగాధరం, తదితరులు పాల్గొన్నారు.

➡️