పూర్తిగా పంట నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం

Dec 6,2023 16:23 #Bapatla District
cpm demand on crop damage

ఈ క్రాప్ తో సంబంధం లేకుండా నష్టపరహారం ఇవ్వాలి

ప్రజాశక్తి-రేపల్లె : మండల పరిధిలో గ్రామాలలో తుఫాను వల్ల పడిపోయిన వరిపంటను సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గం పరిధిలో సుమారు 80,000 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. వీటిల్లో రేపల్లె మండలంలో 19800 ఎకరాలు వరి సాగు చేశారు, దాదాపుగా వర్షం నీటిలో నిండిపోయిన పరిస్థితి వీటిని కాపాడుకోవడం కోసం రైతులు పొలంలో నీళ్లు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్న డ్రైనేజీ అధికారులు గతంలో సమగ్రమైనటువంటి మరమ్మత్తులు చేయకపోవడం వల్ల ఇంకా పంట భూముల్లోనే వర్షం నీళ్లు ఉన్నాయా, ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన వర్షం నీళ్ళు బయటికి వెళ్లేలాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల చేతికివచ్చిన వరిపంట నీటమునిగి రైతులు,కౌలురైతులు నష్టపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమూరేషన్ చేసి పూర్తిగా నష్టపరిహారం చెలించాలని డిమాండ్ చేశారు. మరిముఖ్యంగా కౌలురైతులు అప్పులుతెచ్చి ఎకరాకు 35వేలు వరకు పెట్టుబడిపెట్టారు, 20వేలు కౌలు చెల్లించి పూర్తిగా నష్టపోయారు.రాష్ట్ర ప్రభుత్వం వీరిని అదుకోకపోతే తీసుకొచ్చిన అప్పులు తీర్చలేక కుటుంబాలు చితికిపోతాయి. కొద్దిమంది కౌలు రైతులకు కౌలు కార్డులు లేవు. ఈక్రాప్ చేయలేదు కావున ఈక్రాప్ తో సంబంధంలేకుండా పూర్తిగా నష్టపరిహారం ఇవ్వలని డిమండ్ చేశారు. పంటలను పరిశీలించిన వారిలో రైతు సంఘం నాయకులు జి.దానియేలు,సిపిఎం నాయకులు కే రమేష్,డి శ్రీనివాసరావు, వి.మావో తదితరులు పాల్గొన్నారు.

➡️