రాజవొమ్మంగిలో దూసుకుపోతున్న సిపిఎం ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు) : రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా ఇండియా కూటమి కాంగ్రెస్‌ బలపరిచిన లోతా రామారావు ఎన్నికల ప్రచారంను శనివారం రాజవొమ్మంగి మండలం ఒట్టిగడ్డలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు జండా ఊపి ప్రారంభించారు. సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లతా రామారావుకు ఒట్టిగడ్డ గ్రామ మహిళలు పూలమాలలు వేసి, నుదుటికి తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. ప్రచారానికి ముందు లోత రామారావు సిపిఎం నేతలపై పూల వర్షం కురిపించారు. కళాకారుల ప్రచారంలో యువకులు, మహిళలు, ప్రజానాట్య కళాకారులు ప్రదర్శించిన నఅత్యాలు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నేతలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

➡️