కొవ్వాడలో అణుకుంపటి పెట్టి జిల్లాను నాశనం చేసే బిజెపిని ఎన్నికల్లో ఓడించాలి : సిపిఎం

Apr 27,2024 11:37 #BJP, #cpm, #defeated, #Kovwada district

కొవ్వాడ (శ్రీకాకుళం) : కొవ్వాడలో అణుకుంపటి పెట్టి జిల్లాను నాశనం చేసే బిజెపిని ఎన్నికల్లో ఓడించాలని … సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.కఅష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇండియా ఫోరం తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరిమజ్జి మల్లేశ్వరరావును గెలిపించాలని కోరుతూ … ఇండియా ఫారం తరఫున సిపిఎం, కాంగ్రెస్‌ నాయకులు వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక ఇండియా ఫోరం ఎన్నికల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు పెట్టి ప్రజల జీవితాలతో చలగాట మాడుతుందని విమర్శించారు. మానవతప్పిదం వలన గాని, యంత్రలోపం వలన ఏచిన్న ప్రమాదం జరిగినా అనుధార్మికతతో ఇటు కాకినాడ నుండి ఒరిస్సా ఛత్రపూర్‌ వరకు సమస్త జీవకోటి సర్వ నాశనం అయిపోతుందని అన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి ,జనసేన పార్టీలను బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రత్యేక హౌదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడం ఎవరికి మోసం చేయడానికి అని ప్రశ్నించారు . బిజెపి దేశంలో ప్రజాస్వామ్యం లౌకిక తత్వం ఫెడరల్‌ వ్యవస్థను ఒక పథకం ప్రకారము ధ్వంసం చేస్తుందని పౌరుహక్కులు కాలు రాస్తుందని వారు విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ధారాధత్వం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌,రోడ్లు, పోర్టు, విద్యుత్తు, ఆయిల్‌ సెక్టార్‌, రైల్వే మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారదత్తం చేసిందని విమర్శించారు. ప్రజల సంపదను ప్రకఅతి వనరులను కార్పొరేటర్‌ సంపదగా బిజెపి మార్చేస్తుందని విమర్శించారు. బిజెపి విధానాలతో పరిశ్రమలు మూసివేయబడుతున్నాయని కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దుచేసి గిరిజనుల భూములకు రక్షణ లేకుండా చేసిందని, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను 4లేబర్‌ కొడ్‌ లు గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా బిజెపి ప్రభుత్వం చేసిందని విమర్శించారు . కొండలను గనులను అంబానీ, ఆదానికి బిజెపి ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు సరే కదా భూములు అంబానీ, అధానిలకు అప్పజెప్పేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు . ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కే.నాగమణి, పి తేజేశ్వరరావు, స్థానిక నాయకులు సిహెచ్‌. అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️