రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలి : సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు

శ్రీకాకుళం : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. సోమవారం చిలకపాలెంలో అంబేద్కర్‌ విగ్రహానికి మొదటగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ … సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ … ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో టిడిపి, జనసేన జత కట్టడం ఎవరిని మోసం చేయడానికి అని ప్రశ్నించారు. బిజెపి దేశంలో ప్రజాస్వామ్యం లౌకిక తత్వం ఫెడరల్‌ వ్యవస్థను ఒక పథకం ప్రకారము ధ్వంసం చేస్తుందని పౌరుహక్కులు కాలు రాస్తుందని విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ధారాధత్తం చేస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టులు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, రోడ్లు, పోర్టు, విద్యుత్తు, ఆయిల్‌ సెక్టార్‌, రైల్వే మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసిందని విమర్శించారు. ప్రజల సంపదను ప్రకఅతి వనరులను కార్పొరేటర్‌ సంపదగా బిజెపి మార్చేస్తుందని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసి గిరిజనుల భూములకు రక్షణ లేకుండా చేసిందని, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌ లు గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా బిజెపి ప్రభుత్వం చేసిందని విమర్శించారు . కొండలను గనులను అంబానీ, ఆదానికి బిజెపి ధారాదత్తం చేస్తుందని విమర్శించారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు సరే కదా భూములు అంబానీ ఆదరణలకు అప్పజెప్పేస్తున్నారని విమర్శించారు. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలని, గిరిజన ప్రాంతాలని 5 షెడ్యూల్లో చేర్పించి 1/ 70 చట్టాన్ని అమలు చేయాలని, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, రైల్వే జోన్‌, ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించాలని ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు . ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి కరిమజ్జి మల్లేశ్వరరావును గెలిపించాలని వారు కోరారు. బహిరంగ సభ అనంతరం అంబేద్కర్‌ విగ్రహం నుంచి చిలకపాలెం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో సిపిఎం నాయకులు సిహెచ్‌.అమ్మనాయుడు,తోనంగి. నందోడు, ఎన్‌.వి.రమణ పి.దుర్గాప్రసాద్‌, వెలమల.రమణ, వివిధ యూనియన్ల నాయకులు డి. బంగార్రాజు, వై .గోపాలుడు, ఎల్‌ .వరదరాజు ,ఎం.రమణ, జి.కిరణ్‌ కుమార్‌, ఎం.అప్పలనరసయ్య తది తరులు ప్రసంగించారు.

➡️