స్టీల్‌ప్లాంట్‌తో గాజువాక అభివృద్ధి

సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు

ప్రజాశక్తి -గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్‌తోనే గాజువాక నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ఇండియా ఫోరం బలపరిచిన గాజువాక నియోజవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు అన్నారు.సోమవారం నియోజకవర్గ పరిధిలోని తోకాడ, గాజువాక ఆటోనగర్‌, స్వతంత్రనగర్‌, కుంచుమాంబ కాలనీల్లో జగ్గునాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తోకాడలో ఉన్న 22 ‘ఎ’ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటుపరం కాకుండా ఉంటేనే గాజువాక ఆటోనగర్‌కు వర్క్‌ ఆర్డర్లు రావడానికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడానికి చూస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి. రాష్ట్రంలోని తెలుగుదేశం, వైసిపి మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు. కేంద్రంపై పోరాడే సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు, నాయకులు అరుణ, చిట్టిబాబు, రమేష్‌ పాల్గొన్నారు.సిపిఎం గెలుపు కోరుతూ ఫ్లాష్‌మాబ్‌ ఇండియా ఫోరం బలపర్చిన గాజువాక నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు గెలుపు కోరుతూ చినగంట్యాడ జంక్షన్‌, కుంచుమాంబ కాలనీ, బీసీ రోడ్డులో సోమవారం విద్యార్థులు ఫ్లాష్‌మాబ్‌ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి జగ్గునాయుడును గెలిపించాలని, సిపిఎం పోరాటాలు, ఎర్రజెండా ఎగరాలని, పలు పాటలతో ఫ్లాష్‌మాబ్‌ నిర్వహించారు. ‘జగ్గునాయుడు గెలుపుతో స్టీల్‌ప్లాంట్‌ రక్షణ’ అనే పాట ప్రజలను ఆకట్టుకుంది.

➡️