శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి

Jun 20,2024 19:47

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు అభివృద్ధి చెందేలా సిబ్బంది కృషి చేయాలని డిఇఒ ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ సూచించారు. అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను విజయవంతంగా నిర్వహించాలి తెలిపారు. జిల్లాలో గల 42 అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ల ప్రధాన ఉపాధ్యాయులు, ల్యాబ్‌ నోడల్‌ టీచర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో డిఇఒ మాట్లాడారు. ల్యాబ్‌ పని తనాన్ని నిర్ధారించడానికి 13 ఇండికేటర్లు ఇచ్చామన్నారు. సూచికల ఆధారంగా ల్యాబ్‌ పనితనానికి రేటింగ్‌ ఇస్తూ పాయింట్లు ఇస్తామన్నారు. ఈ సూచికలన్నీ విజయవంతంగా అమలు చేసిన పాఠశాల ల్యాబ్‌ కు ఐదు పాయింట్లు ఇస్తామన్నారు. రానున్న రోజులలో ప్రతినెల జిల్లా కలెక్టర్‌ సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారపు. కార్యక్రమంలో రిసోర్స్‌ పర్సన్‌గా వి.రమేష్‌ వ్యవహరించారు. జిల్లా సైన్స్‌ అధికారి ఎం.కృష్ణారావు పాల్గొన్నారు.

➡️