పుస్తకాలు విక్రయాన్ని అరికట్టాలి

Jun 27,2024 12:34 #Vizianagaram

స్పందించని అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఎస్ ఎఫ్ ఐ డిమాండ్
కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లాలో ఉన్న కార్పోరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో సంస్థల పేరుమీద పుస్తకాలు ప్రింట్చేసి పాఠశాల ఆవరణంలో విక్రయిస్తున్నారు. పేద మద్యతరగతి విద్యార్థుల నుండి వేలకు వేలు పుస్తకాలు పేరుమీద వసూలు చేస్తున్నారు. వీటిపై అధికారులు స్పందించడంలేదు వెంటనే కలెక్టర్ కలుగుచేసుకొని చర్యలు తీసుకోవాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము డిమాండ్ చేశారు. గురువారం ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎస్ఎఫ్ఎ అక్రమ పుస్తక వ్యాపారాలను గుర్తించి ఆందోళనలు చేసి పుస్తకాలు గదులను సీజ్ చేయిస్తుంటే అధికారులు మళ్లీ వాటిని విడిపిస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలో బొబ్బిలి సురేష్ స్కూల్ యాజమాన్యం స్కూల్ పేరుమీద పుస్తకాలు ప్రింట్ చేసి అమ్ముతుంటే అధికారులు ఆ గదిని సీజ్ చేసారన్నారు. అక్కడకు నాలుగు రోజులు తరువాత ఆ సీల్ను తీసేసి యాజమాన్యం పుస్తకాలను మళ్లీ విక్రయించిందన్నారు. సీజ్ చేసిన గదిని ఎందుకు ఓపెన్ చేసారని అడిగితే డిప్యూటి డిఇఓ ఓపెన్ చేసుకోమన్నారని యాజమాన్యం తెలియజేసిందన్నారు. దీనిపై ఆందోళన చేస్తే ఎంఇఓ సంఘటనా స్థలానికి వచ్చి కూడా చూసి చూడనట్లు వెల్లిపోయారు తప్పితే ఎటువంటి చర్యులు తీసుకోలేదన్నారు. విద్యాహక్కు చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కావున కార్పోరేట్ విద్యాసంస్థల్లో పుస్తకాలు విక్రయాన్ని ఆపాలనీ డిమాండ్ చేశారు.విద్యాహక్కు చట్టాన్ని అతిక్రమించడమే కాకుండా అధికారులపై ఎటువంటి గౌరవం లేకుండా సీల్ ఓపెన్ చేసిన సురేష్ స్కూల్ను సీజ్ చెయ్యాలన్నారు. యాజమాన్యానికి సహకరించిన బొబ్బిలి డిప్యూటి డిఇఓ, ఎంఇఓ లను సస్పెండ్ చేయాలని కోరుతున్నామన్నారు.ధర్నా లో ఎస్ ఎఫ్ ఐ సహాయ కార్యదర్శులు సమీరా, రమేష్, నాయకులు రాజు,వంశీ,ఏర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️