పాలకొల్లులో మున్సిపల్‌ కార్మికుల ధర్నా

Dec 11,2023 13:25 #Dharna, #municipal workers, #Palakollu

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : మున్సిపల్‌ పర్మినెంట్‌, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పాలకొల్లు మున్సిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ ఎదుట కార్మికులు సోమవారం ధర్నా చేపట్టారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు సారధ్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ … కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ .. ఈనెల 27 నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు ధనాల శ్రీను, ప్రధాన కార్యదర్శి ధనాల ఏడుకొండలు, ఉపాధ్యక్షులు అల్లం సాయిబాబా, ఆకుల అప్పారావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ముత్యాల రాంబాబు, ధనాల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️