ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన డిఐజి అజిత్‌ సింగ్‌

May 2,2024 23:12

ఎస్పీతో కలిసి స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలిస్తున్న డిఐజి అజిత్‌ సింగ్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ డిఐజి అజిత్‌సింగ్‌ గురువారం పరిశీలించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలన్నారు. ఏ మూలన ఏ సంఘటన జరిగినా వెంటనే ఎస్పీ దృష్టికి తెచ్చి, త్వరితగతిన పరిష్కరించడానికి వీలుగా ఎలక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఓటర్లు, ప్రజలు ఎలక్షన్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులపై పోలీసులు వెంటనే చర్య తీసుకుంటారన్నారు. నరసరావుపేట మండలం జెఎన్‌యుటి కాలేజీలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌లను పరిశీలించి, అక్కడ పోలీసులు చేపట్టిన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇవిఎంల తరలింపు, ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకు అధికారుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

➡️