విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ

Dec 28,2023 16:49 #East Godavari

ప్రజాశక్తి – సీతానగరం (తూర్పుగోదావరి ) స్థానిక పువ్వాడ సత్యమాంభ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీతానగరం జగనన్న విద్యా కానుకలో భాగంగా మండలం స్థాయిలో ఎంఈఓ స్వామి నాయక్ ఆధ్వర్యంలో టాబ్స్ పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గుర్రాల జ్యోస్నా, మండల వైసీపీ కన్వీనర్ గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా టాబ్స్ ఆవిష్కరణ చేసీ, వాటిని విద్యార్థులకి పంపిణీ చేశారు.అనంతరం స్వామి నాయక్ మాట్లాడుతూ టాబ్స్ ను విద్యార్థులు చక్కగా ఉపయోగించుకుని మరింత జ్ఞానము సంపాదించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్ బి.సూర్య కుమారి, సరితా సోనీ, జడ్పీటీసీ చల్లమళ్ళ వెంకట లక్ష్మి, వైస్ ఎంపీపీ మదన్ మోహన్, సర్పంచ్ సంఘం సమాఖ్య అధ్యక్షులు కొండ్రపు ముత్యాలు, ఎంపీటీసీ లు అప్పలనాయుడు, ఆర్బీకే చైర్మన్ తోటలో రాజు, ప్రత్యేక సలహాదారు సుజిరాజు, ఆత్మ చైర్మన్ డాక్టర్ బాబు, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి మద్దాల కొండలరావు, ప్రధానోపాధ్యాయులు ఎం. వీరభద్రం రావు, ఉషారాణి, ప్రమీల రాణి ఉపాధ్యాయులు కె. సతీష్ బాబు, పీడీ శంకర్ రావు, ముస్తఫా, పి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

➡️