బాలింతలకు రొట్టెలు, పండ్లు పంపిణీ

May 13,2024 00:50 #bread, #milk
Bread, milk

 ప్రజాశక్తి- గోపాలపట్నం : గోపాలపట్నం కళాసేవా పీఠం ఆధ్వర్యాన మదర్స్‌ డే సందర్భంగా గోపాలపట్నం కళాసేవా పీఠం అధ్యక్షులు నందవరపు సోములు ఆధ్వర్యాన బాలింతలకు రొట్టెలు, పండ్లు పంపిణీచేశారు. ముందుగా గోపాలపట్నం 30 పడకల ఆసుపత్రిలోని నందవరపు సోములు మాతృమూర్తి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందవరపు సోములు మాట్లాడుతూ, మదర్స్‌ డే సందర్భంగా తల్లిని గౌరవించడం సంప్రదాయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాపీఠం సభ్యులు కంపర అప్పారావు, చందు సుబ్బారావు, గరకల రామదాసు, కొంతం నూకరాజేశ్వరరావు, రామచంద్రరావు, నవీన్‌ మాస్టర్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌ పాణిగ్రహి, కన్నంనాయుడు, గంపల అప్పారావు, అందిపోయిన శ్రీనివాసు, జి సింహాచలం పాల్గొన్నారు.

➡️