రైతులకు పిఎండిఎస్‌ కిట్లు పంపిణీ

May 20,2024 23:40 #PMDS Kits
pmds kits

ప్రజాశక్తి- ఆనందపురం : ఆనందపురం మండలం తర్లువాడ, పాలవలస గ్రామంలో రైతులకు పిఎండిఎస్‌ కిట్లు సరఫరా చేసి వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రీజనల్‌ అధికారి ప్రకాష్‌, జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ మోహన్‌రావు హాజరయ్యారు. రైతులకు పిఎండిఎస్‌ చేయడం వల్ల ఉపయోగాలను రీజనల్‌ అధికారి ప్రకాష్‌ వివరించారు. పిఎండిఎస్‌లో నవధాన్యాలు వేసి 365 రోజులు భూమిని కప్పి ఉంచడం వల్ల భూమి ఆరోగ్యంతో పాటు రైతులకు సంవత్సరం పొడువునా ఆదాయం వస్తుందని తెలిపారు. జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ మాట్లాడుతూ, పలు పంటలు వెయ్యడం వల్ల పురుగులు, తెగుళ్లు బారి నుంచి ప్రధాన పంటను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా నేచురల్‌ ఫార్మింగ్‌ అసోసియట్‌ హెచ్‌ఆర్‌ చక్రవర్తి, మండల సిబ్బంది పాల్గొన్నారు.

➡️