చీరల పంపిణీ

May 13,2024 00:48 #Andiboyuna, #sarees distribution
Saree

 ప్రజాశక్తి -గాజువాక : అండిబోయిన అప్పారావు యాత కార్పొరేషన్‌ డైరెక్టర్‌, హైకోర్టు న్యాయవాది అండి బోయిన లక్ష్మి వివాహ దినోత్సవం సందర్భంగా ఆదివారం సమతానగర్‌లో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి హాజరై మాట్లాడుతూ, అండిబోయిన అప్పారావు, లక్ష్మి దంపతులు పేదలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరూ మంచి క్రీడాకారులన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, ఐఎన్‌టియుసి నాయకులు మంత్రి రాజశేఖర్‌, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు మస్తానప్ప, స్థానిక నాయకులు వేంపాడు అప్పారావు పాల్గొన్నారు.

➡️