సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి- జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సర్వం సన్నద్ధం కావాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి, పక్కా ప్రణాళిక, టీం వర్క్‌తో ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా , మండల స్థాయి నోడల్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా, మండల స్థాయి నోడల్‌ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అంశంలో తీసుకున్న చర్యలపై నియోజకవర్గం వారీగా కూలంకషంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాలలో నోడల్‌ అధికారులు నియామకం, మాన్‌ పవర్‌ మేనేజ్మెంట్‌ లో పిఓ, ఏపిఓ, ఓపిఓల నియామకం, ఎఫ్‌ఎస్‌టి, ఎస్‌ఎస్‌టి, సి విజిల్‌ పరిష్కారం, మెటీరియల్‌, ఈవీఎంల మేనేజ్మెంట్‌, రిసెప్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ మరియు కౌంటింగ్‌ ఏర్పాట్లు, ఐటి అప్లికేషన్స్‌ నిర్వహణ, తదితరాంశాలలో సుదీర్ఘంగా చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దష్టిలో ఉంచుకొని లోపాలను పునరావతం కాకుండా చూడాలన్నారు. మ్యాన్‌ పవర్‌లో భాగంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, నోడల్‌ అధికారులు సెక్టరుల అధికారులు వివిటి ఎస్‌ స్‌ టి అధర్‌ సెక్రటేరియల్‌ అధికారులకు ఐడి కార్డులు జారీ చేయాలన్నారు. మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి రిసెప్షన్‌ డిస్ర ి్టబ్యూషన్‌ కౌంటింగ్‌ ఏర్పాట్లను పక్కా ప్రణాళికను రూపొందించుకొని పూర్తి చేసుకోవాలన్నారు. ఇవిఎం మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఫస్ట్‌ రాండమైజేషన్‌, కమిషనింగ్‌ తర్వాత ఏవైనా డిఫెక్ట్‌ ఉంటే వాటిని వెంటనే మార్చాలన్నారు. ఎన్నికలలో పోలీస్‌ శాఖతో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా నగదు, బంగారు, వెండి, మద్యం, గంజాయి, వస్తువుల రవాణా, లా అండ్‌ ఆర్డర్‌ పై ప్రత్యేక దష్టి సారించాలని పేర్కొన్నారు. జిల్లాలో మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఓటరుహక్కు వినియోగం, కొత్త ఓటర్ల నమోదుకు ఓటరు చైతన్య కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ రోజు ముందు జాగ్రత్తగా ఇవిఎంలు, వివి ప్యాట్‌ లను అవసరమైన మేరకు రిజర్వులు ఉంచుకోవాలని సూచించారు. తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా శాంతియుత స్వేచ్ఛ వాతావరణంలో ఎన్నికలు జరిగేలా బాధ్యతాయుతంగా పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ రావు, ఆర్‌డిఒలు, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, జిల్లా, మండల స్థాయి నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️