రోజూ స్టాకు నిల్వలు తనిఖీ చేయాలి- జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ నోడల్‌ అధికారి చంద్ర నాయక్‌

ప్రజాశక్తి- రాయచోటి ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేసే సూపర్‌వైజర్లు నిల్వ ఉన్న మద్యం స్టాకును రోజూ తనిఖీ చేస్తూ ఉంటే ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉంటుందని అన్నమయ్య జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం నోడల్‌ అధికారి చంద్రనాయక్‌ సంబంధిత సిబ్బందికి సూచించారు. ఆదేశాల మేరకు శనివారం గాలివీడు మండలంలోని వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల దష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుచు కోవాలన్నారు. మద్యం నియంత్రణ కోసం జిల్లాలోని చెక్‌ పోస్ట్లుతో పాటు ప్రభుత్వ మద్యం దుఖానాలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఎప్పటి కప్పుడూ జిల్లా ఎన్నికల అధికారి దష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. సంభందిత రిజిస్టర్ల ద్వారా నిల్వ ఉన్న స్టాకును సిబ్బంది సహాయంతో నిశితంగా పరిశీలించారు. ముందు రోజు విక్రయించిన వచ్చిన నగదు సకాలంలో సంబంధిత బ్యాంక్‌లో జమ చేస్తున్నారా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలలో ఆయన వెంట డిప్యూటీ తహశీల్దార్‌ జయసింహ, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామకష్ణ శాస్త్రి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ గాయత్రీ, జి.ఎస్‌.టి అధికారి హేమంత్‌ కుమార్‌తో పాటు టీం సభ్యులు సుధాకర్‌, విజరురెడ్డి, నాయక్‌ పాల్గొన్నారు.

➡️