ఉచితంగా న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్‌

May 23,2024 17:10 #East Godavari
  •  జిల్లాస్థాయి పోలీసు కంప్లైం ట్‌ అథారిటీ ఛైర్మన్ ఆర్. జె. విశ్వనాథం

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : పోలీసు అధికారులు విధులు దుర్వినియోగం చేస్తే సామాన్యుడు జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీ కి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని , తగిన న్యాయం పొందవచ్చునని జిల్లాస్థాయి పోలీసు కంప్లైం ట్‌ అథారిటీ చైర్మన్, రిటైర్డు జడ్జి ఆర్. జె. విశ్వనాథం అన్నారు. గురువారం ఉదయం జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీ, వై టి సి ప్రాంగణం, బొమ్మూరు కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్, విశ్వనాథం మాట్లాడుతూ పోలీసులు వలన సత్వర న్యాయం అందని సందర్భాల్లో, సామాన్యుడికి ఉచితంగా న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీని నియమించడం జరిగిందన్నారు. ఏడు జిల్లాలకు సంబంధించి రాజమండ్రి బొమ్మూరులో కార్యాలయం ఏర్పాటు చేసామన్నారు. కమిటీ చైర్మన్ గా రిటైర్డు జిల్లా జడ్జి ఆర్జే. విశ్వనాథం, కమిటీ మెంబర్లుగా రిటైర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. జితేంద్ర, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ బి. లక్ష్మీనారాయణ, అడ్వకేట్ సిహెచ్. మన్మధరావు లు వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. సామాన్యులను , ప్రజలను పోలీసులు ఎవరైనా ఇబ్బందుల కు గురిచేస్తే స్వయంగా ఫోన్ నెంబర్. 9948464363, ఈ మెయిల్ ఐడి [email protected] కు వారిపై ఫిర్యా దు చేయవచ్చునని ఆయన తెలియ చేశారు. ఇప్పటి వరకు 14 కేసులు వస్తే పది డిస్పోజబుల్ చేయడం జరిగిం దని, ఇంకా నాలుగు కేసులు వివిధ దశల్లో  ఉన్నాయని తెలిపారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన పోలీసు కంప్లైంట్‌ అథారిటీ వారి విభాగం తూర్పుగోదావరి, కాకినాడ, డా.బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన వారు ఫిర్యాదులు చేసేందుకు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీని బొమ్మూరులో ఏర్పాటు చేశామన్నారు.

➡️