గోడు వినిపించదా.. అంగన్వాడీల ఆవేదన

Dec 24,2023 16:57 #Anganwadi strike, #Kurnool

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఇచ్చిన హామీలను నెరవేర్చాలని న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్న తమ గోడును ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దారుణమని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆదోనిలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు 13వ రోజు సమ్మె సందర్భంగా అంగన్వాడీల వర్కర్స్‌ చేవిలో పూలు పెట్టుకోని నిరసన తెలిపారు. ఈ నిరసనలో సీఐటీయు సీనియర్‌ నాయకులు బి.మహానంద రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ 5 లక్షలకు పెంచాలని, పెన్షన్స్‌ సౌకర్యం చివరి జీతంలో 50 శాతం ఇవ్వాలని, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, సూపర్వైజర్‌ ప్రమోషన్‌కు 50 సంవత్సరాలు పెంచాలని, సర్వీసులో చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, వేతనంతో కూడిన లీవ్‌ సౌకర్యం కల్పించాలని, మెనూ ఛార్జీలను పెంచాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని, పెండింగ్‌ సెంటర్‌ అద్దెలు టిఏ బిల్లులు ఇవ్వాలని, ఫేస్‌ యాప్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ రూపాలలో అంగన్వాడీలు నిరసన చేస్తున్న ప్రభుత్వం మొద్దునిద్ర గావ్యవహరించడం తగదన్నారు. చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శులు తిప్పన్న, గోపాల్‌, మండల అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, వీరారెడ్డి, అజీమ్‌ ఖాన్‌, ఎఐటియుసి పట్టణ నాయకులు టి వీరేష్‌, విజరు అంగన్వాడీ వర్కర్లు పద్మా, రేణుక, సరోజ, సోమక్క, గీత, వీరమ్మ, మీనా కుమారి, రిజ్వానా, శారద, ఈరమ్మ, అంగన్వాడీలు వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

➡️