దస్తగిరి స్వామి దర్గా కు లక్ష రూపాయలు విరాళం

Jun 18,2024 16:02 #Kurnool

ప్రజాశక్తి – తుగ్గలి : మండల పరిధిలోనే ఎద్దులదొడ్డి గ్రామంలో దస్తగిరి స్వామి దర్గాకు స్థానిక టిడిపి నాయకుడు పెడసాని రామానాయుడు మంగళవారం లక్ష రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుడు పెడసాని రామానాయుడు మాట్లాడుతూ దస్తగిరి స్వామి దర్గా ఎద్దులదొడ్డి గ్రామానికి ఎంతో పవిత్రమైనది అన్నారు. దర్గా వద్ద నబి సాహెబ్ స్థలం ఉండడంతో ఆ స్థలాన్ని నబి సాహెబ్ దర్గాకు అప్పగించడంతో ఆయనకు లక్ష రూపాయలు తాను సొంత డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. గ్రామస్తుల సహకారంతో దర్గాకు కాంపౌండ్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెడసాని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

➡️