ఓవర్లో 43పరుగులు

Jun 26,2024 23:05 #Sports

ఓలీ రాబిన్సన్‌ చెత్త బౌలింగ్‌ రికార్డు
లండన్‌: ఇంగ్లండ్‌ పేసర్‌ ఓలీ రాబిన్సన్‌ కౌంటీల్లో ఓ చెత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు. సొంతగడ్డపై జరిగిన కౌంటీ మ్యాచ్‌లో రాబిన్సస్‌ వేసిన ఓవర్‌ను లిసెస్టర్‌షైర్‌ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఒకే ఓవర్లో 43 పరుగులు పిండుకున్నారు. సస్సెక్స్‌ జట్టుకు ఆడుతున్న రాబిన్సన్‌ జూన్‌ 25న జరిగిన మ్యాచ్‌లో బలిపశువు అయ్యాడు. రాబిన్సన్‌ బౌలింగ్‌లో లీసెస్టర్‌షైర్‌ బ్యాటర్‌ లూయిస్‌ కింబర్‌  37 రన్స్‌ కొట్టగా.. మిగతా ఆరు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. రాబిన్సన్‌ ఆ ఓవర్లో 9 బంతులు వేయగా.. కింబర్‌ ఏకంగా ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో, ఈ స్పీడ్‌స్టర్‌ బిక్కమొహం వేశాడు. మరో కౌంటీ మ్యాచ్‌లో యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ సైతం 38 పరుగులు ఇచ్చాడు. భారత పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన బషీర్‌ అద్భుతంగా రాణించాడు. దాంతో, ఇంగ్లండ్‌ జట్టులో స్థానాన్ని పదిలపరుచుకుంటాడనుకున్న వేళ బషీర్‌.. ఈ స్థాయిలో పరుగులివ్వడం ఆ దేశ క్రికెట్‌ బోర్డును కలవరపరుస్తోంది.

➡️