మోసాల మేనిఫెస్టోను నమ్మొద్దు

May 9,2024 21:31

ప్రజాశక్తి – గజపతినగరం : టిడిపి మో సాల మేనిఫెస్టో వద్దు, సంక్షేమ పాలన అందిస్తున్న వైసిపికే తమ మీ ఓటును గుద్దాలని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య అన్నారు. గురువారం మండలంలోని ఎం.గుమ్మడం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమం అందించామని, మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగాలంటే తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్‌ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️