‘చెరగని సిరా వదంతులను నమ్మొద్దు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ మల్లికార్జున

ప్రజాశక్తి- విశాఖపట్నం : చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ, ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జరుగుతోందంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లికార్జున సూచించారు. ఎన్నికల్లో చూపుడు వేలిపై రాసే సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రయివేటు వ్యక్తులు సేకరించడానికి గానీ, వినియోగించడానికి గానీ వీలులేదన్నారు. కేవలం ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే అధికారులు, సిబ్బంది వద్ద పోలింగ్‌ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లకు గుర్తు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తారని, ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు అపోహలకు గురికాకుండా నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మల్లికార్జునసూచించారు.

➡️