ఇంటింటి ప్రచారం

Apr 6,2024 21:57
ఫొటో : వృద్ధురాలితో మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌

ఫొటో : వృద్ధురాలితో మాట్లాడుతున్న కాకర్ల సురేష్‌
ఇంటింటి ప్రచారం
ప్రజాశక్తి-సీతారామపురం : తెలుగుదేశం కూటమి విజయం రాష్ట్రాభివృద్ధికి అవసరమని ఉదయగిరి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి కాకర్ల సురేష్‌ పేర్కొన్నారు. శనివారం సీతారామపురం పంచాయతీలో సర్పంచ్‌ కొడవటికంటీ భాగ్యమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల హామీల కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్‌ మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ఉదయగిరి కోటను పర్యాటక కేంద్రంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న ఎన్నికలో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసిపికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కప్ప ప్రభాకర్‌రాజు, మాజీ ఎంపిపి కల్లూరి జనార్థన్‌ రెడ్డి, అబ్రహం తెలుగు యువత అధ్యక్షులు చింతల శ్రీనివాసులు, మాజీ జెడ్‌పిటిసి కలివేల జ్యోతి, జనసేన నాయకులు భోగినేనికాశి రావు, శ్రీనివాసులు, ఆలూరు రవీంద్ర, మాజీ మండల ఉపాధ్యక్షులు ఎస్‌.రాజశేఖర్‌, ఎంపిటిసి తమ్మిశెట్టి వెంకటసుబ్బమ్మ, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి వెంగళచెట్టి వెంకటేశ్వర్లు, క్రిస్టియన్స్‌ అధ్యక్షులు ఓబులాపురం ప్రసన్న కుమార్‌, సర్పంచ్‌లు కల్లూరి వెంకటరెడ్డి, ఎం.వెంకటసుబ్బయ్య, గానులపల్లి చంద్రారెడ్డి, జాషువా కలివేల బాలస్వామి, పిడుగు రమేష్‌, సింగాలా నాగేష్‌, ఆళ్ళూరి శ్రీనివాసులు తదితులున్నారు.

➡️