ఎన్నికల నియమావళిపై కలెక్టర్‌ సమీక్ష

Mar 18,2024 23:18
ఎన్నికల నియమావళిపై కలెక్టర్‌ సమీక్ష

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత సోమవారం ఎస్‌పి పి.జగదీష్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లోక్‌సభ, శాసనసభకు సార్వత్రిక ఎన్నికల సమయంలో భారీ మొత్తంలో నగదు లావాదేవీలు, నగదు, వస్తు రూపంలో పంపిణీ, మద్యం పంపిణీ తదితర నివేదికలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోడల్‌ ఏజెన్సీలు నిర్ధేశించిన వెబ్‌ సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ప్రజలు ఎన్నికల సమయంలో రూ.50 వేలకు మించిన నగదు వెంట తీసుకుని వెళ్ళే సందర్భంలో తగిన ఆధారాలు చూపాలన్నారు. లేని ఎడల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు అటువంటి వాటిని సీజ్‌ చేస్తాయ్నఇ చెప్పారు. ఎలక్షన్‌ కమిషన్‌ మార్గదర్శకాల మేరకు ఇఎస్‌ఎంఎస్‌ యాప్‌లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లాగిన్‌ అవ్వాలని స్పష్టం చేశారు. నిఘా తనిఖీల్లో, చెక్‌ పోస్టుల వద్ద స్వాధీనం చేసుకున్న వాటి వివరాలను నిర్ధేశించిన కాలవ్యవధిలో నమోదు చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలనానరు. ఇది వన్‌ స్టాప్‌ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో సరుకులు, రూ.50 వేలు మించి నగదు రూపంలో వ్యక్తులు తీసుకుని వారీ వద్ద సదరు నగదు లావాదేవీలు సంబందించిన నిర్ధారణ పత్రాలు దగ్గర ఉంచుకోవాలని అన్నారు. ఎవరైనా రూ.10 లక్షల పైబడి తీసుకువెళ్తే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఆ మొత్తాన్ని సీజ్‌ చేస్తాయన్నారు. అనంతరం వాటికి సంబంధించిన ధ్రువపత్రాల ఆధారాలను అందజేస్తే విడుదల చేస్తారని చెప్పారు. విమానాశ్రయంలో వాణిజ్య, వాణిజ్యేతర విమానాశ్రయాలు, హెలిప్యాడ్‌లలో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, బ్యాగేజీల స్క్రీనింగ్‌, ఫిజికల్‌ చెకింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు. ఏదైనా ప్రాంగణంలో నగదు లేదా ఇతర విలువైన వస్తువుల నిల్వకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఎస్‌ఒపిని అనుసరింన్నారు. వ్యయ పరిశీలకుడు, నోడల్‌ అధికారి, జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోడల్‌ అధికారికి ఆదాయం పన్ను తెలియజేయాలన్నారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్ట్‌ ఆడిట్‌ అధికారి వెంకటేశ్వరరావు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ వి.సోమశేఖర్‌, జిల్లా రవాణా అధికారి కెవి.కృష్ణారావు, జిల్లా ఎక్సైజ్‌ అధికారి వై.శ్రీలత, స్టేట్‌ జిఎస్‌టి జాయింట్‌ కమిషనర్‌ జె.నీరజ, జిల్లా అటవీ అధికారి బి.నాగరజు, ఐటి అధికారి రాజశేఖర్‌, సెంట్రల్‌ జిఎస్‌టి ప్రతినిధి శ్రీధర్‌, సహయ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ కె.జయ, మౌనిక పాల్గొన్నారు.

➡️