పదో తరగతి పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 23:20
పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభం అయ్యాయి. గోపాలపురం మండలంలోని మొదటి రోజు పది పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఎంఇఒలు జి.శ్రీనివాసరావు, మహేశ్వరరావు తెలిపారు. మండలంలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో మొదటిరోజు పరీక్షకు 1,021 మంది విద్యార్థులకుగాను 866 మంది విద్యార్థులు మాత్రం పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. 155 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు తెలిపారు. పెరవలి మండలంలో 903 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు ఎంఇఒలు బిబిఎస్‌.స్వరూప్‌, ఎస్‌.నూర్జాన్‌ తెలిపారు. మండల పరిధిలోని 5 పరీక్షా కేంద్రాల్లో సోమవారం 845 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైట్టు చెప్పారు. 58 మంది పరీక్షకు గైర్హాజరైనట్టు తెలిపారు. గోకవరం మండలంలో 794 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఎంఇఒలు బి.గైరమ్మ, ఎం.చిమ్మరాజు దొర తెలిపారు. 54 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్టు తెలిపారు. రంపఎర్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన వంకర గీతాశ్రీ పరీక్షలు రాయలేని కారణంగా ఆమెకు సహాయంగా మరో విద్యార్థి హాజరయ్యారు. డిఇఒ ఆదేశాల మేరకు మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. తాళ్లపూడి మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు 638 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని,78 మంది విద్యార్థులు ఆబ్సెంట్‌ అయ్యారని ఎంఇఒలు బాలామణి, నెహ్రూజీ తెలిపారు. చాగల్లు మండలం మూడు సెంటర్లలో 394 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఇఒలు వి.ఖాదర్‌ బాబు, సిహెచ్‌.సుధాకర్‌ తెలిపారు. ఉండ్రాజవరం పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరీక్షించడం కనిపించింది. తమ పిల్లలు పరీక్ష ఎలా రాస్తున్నారు, పేపర్‌ ఎలా ఉంది అనే విషయాలపై తల్లిదండ్రులు చర్చించుకున్నారు. మండలంలోని 15 గ్రామాల విద్యార్థులకు అధికారులు 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మండలం మొత్తం సుమారు 1100 మంది తొలి రోజు పరీక్షకు హాజరయ్యారు. దేవరపల్లి మండలంలో ఐదు సెంటర్లలో 948 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఎంఇఒలు మాణిక్యం, తిరుమలదాసు, కెఆర్‌ఎస్‌వి.అప్పారావు తెలిపారు.

➡️