వెంకన్న దేవస్థానం భూములు వేలం

Jun 28,2024 13:17 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా) : అన్నవరప్పాడు గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు చెందిన 2.53½ సెంట్లు భూమిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశముల మేరకు శుక్రవారం పరివేక్షణ అధికారి ఎం.వి రామయ్య పర్యవేక్షణలో దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించగా 1,01,300/- ఆదాయం సమకూరునది. గతం కంటే 18,300/- అధిక ఆదాయం దేవస్థానమునకు వచ్చినట్లు తీపర్రు గ్రూపు దేవాలయం కార్యనిర్వహణ అధికారి ఎం.వి. రామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్య నిర్వహణ అధికారి ఎం.రాధాకృష్ణ గ్రామస్తులు, పాటదారులు తదితరులు పాల్గొన్నారు.

➡️