సిఎం వద్ద వాలంటీర్లకు ప్రత్యేక స్థానం

Feb 29,2024 22:35
సిఎం వద్ద వాలంటీర్లకు ప్రత్యేక స్థానం

ప్రజాశక్తి -దేవరపల్లిముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గుండెల్లో వాలంటీర్లకు ప్రత్యేక స్థానం ఉందని.. ఇక అంతకు మించిన అవార్డులు, రివార్డు ఏముందని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత అన్నారు. వాలంటీర్లకు అవార్డులు, రివార్డులు అనేవి వారి ప్రతిభ, పనితీరు ఆధారంగా వస్తాయన్నారు. వాలంటీర్లు జీతం కోసం పనిచేసే ఉద్యోగులు కాదని.. గౌరవ వేతనం తీసుకుంటూ ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు. గురువారం దేవరపల్లిలో ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలోఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం మండలస్థాయి కార్యక్రమంలో 310 మంది వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వాలంటీర్‌, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ సువర్ణయుగం నెలకొల్పారన్నారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో, గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించిన వాలంటీర్లకు అవార్డులను అందిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలోని సంక్షేమం, అభివద్ధి, అందించిన సేవలకు.. జగనన్న ప్రభుత్వంలోని సంక్షేమం, అభివృద్ధి, అందిస్తున్న సేవలకు మధ్య తేడాలను ప్రజలకు వివరించాలని కోరారు. చాగల్లు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వాలంటీర్‌, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ సువర్ణయుగం నెలకొల్పారని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. వాలంటీర్లు జీతం కోసం పని చేసే ఉద్యోగులు కాదని.. గౌరవ వేతనం తీసుకుంటూ ప్రజా సేవ చేస్తున్నారని తెలిపారు. నెలటూరులో గురువారం ఉత్తమ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను ఆయన ప్రదానం చేశారు. మండలంలోని 256 మంది వాలంటీర్లకు ఆవార్డులు ప్రదానం చేసి వారిని పేరు పేరునా పలకరించారు.అవినీతి, వివక్షకు తావు లేకుండా సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహకంగా అవార్డులను అందిస్తుననట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆశయ సాధనకు వాలంటీర్లు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. వరుసగా ఈ ఏడాది కూడా వాలంటీర్లకు వందనం పేరుతో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు ప్రధానం చేయడం ఎంతో సంతోషకరమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని అందజేయాలన్నారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో, గ్రామ, వార్డు సచివాలయాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించిన వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను అందిస్తున్నట్టు చెప్పారు. వాలంటీర్లు మరింత బాధ్యతగా ప్రజలకు సేవలందించాలని హోమ్‌ మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ ఎన్‌.బుజ్జి, సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు. తాళ్లపూడి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థలను తీసుకువచ్చి సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించిన ఘనత వైసిపి ప్రభుత్వానిదేనని ఆ పార్టీ కొవ్వూరు కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, గోపాలపురం ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు అన్నారు. తాళ్లపూడిలోని సొలస సత్యనారాయణ దమయంతి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వైసిపి రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు సమృద్ధిగా అందాయన్నారు. మరోసారి జగనన్న ముఖ్యమంత్రి అయ్యేలా ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించవలసిన ఆవశ్యకత వాలంటీర్లపై ఉందన్నారు. మండలంలో 210 మంది వాలంటీర్లు ఉండగా ఇద్దరికి సేవా వజ్ర, మరో ఐదుగురికి సేవా రత్న అవార్డులను అందజేశారు. ఎంపిపి జొన్నకూటి పోసిరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ పోసిన శ్రీలేఖ, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

➡️