హెచ్‌ఎం రత్నకుమారికి ఘన సన్మానం

Mar 17,2024 22:28
హెచ్‌ఎం రత్నకుమారికి ఘన సన్మానం

ప్రజాశక్తి-గోపాలపురంజాతీయ స్థాయిలో ఉత్తమ హెచ్‌ఎంగా ఎంపికైన గోపాలపురం ఎంపిపి స్కూల్‌ హెచ్‌ఎం ఎన్‌.సిహెచ్‌ రత్నకుమారిని దక్షిణ కొరియాకు చెందిన ఆశ్రా సంస్థ సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. జాతీయ స్థాయిలో ఎంపికైన మహిళలను వారు ఇటీవల ఘనంగా సన్మానించి అవార్డు అందించినట్లు రత్నకుమారి తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు జి.శ్రీనివాసరావు, ఆకుల మహేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జానుబాబు, వెంకటేశ్వరరావు, జి.సుబ్రహ్మణ్యం, టివి.సత్యనారాయణ, కాకి పోసియ్య, నారాయణమ్మ, గణేష్‌, టి.పోషేరావు, కాకి సిరమయ్య, బోడా వెంకటలక్ష్మి జయ కుమారి, సిఆర్‌పి కొయ్య నాగరాజు, పీతల జయ రమణ, ఇస్సాపూరి కృష్ణయ్య, పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

➡️