పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు

Mar 16,2024 15:21 #East Godavari

38 లక్షల ఎంపీపీ నిధులతో పనులు
ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని వివిధ గ్రామాల్లో 38 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేసినట్లు ఎంపీపీ సుంకర శ్రీవల్లి,భర్త వీరబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట వైసీపీ ఇన్చార్జ్, మాజీ మంత్రి తోట నరసింహం ఆదేశాల మేరకు మండలంలోని గోకవరం ముస్లిం కాలనీలో 6 లక్షల రూపాయలతో 2 సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన, అదేవిధంగా బ్రహ్మల కాలనీలో 10 లక్షల రూపాయలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన, 8 లక్షల రూపాయలు వ్యయముతో గోకవరం ఎస్సీ స్మశానవాటికు ఫినిషింగ్, గేట్లు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రంప ఎర్రంపాలెం , పెంటపల్లి గ్రామంలో 6 లక్షల రూపాయలుతో 3 హ్యాండ్ బోర్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. గుమ్మళ్లదొడ్డి గ్రామంలో 6 లక్షల రూపాయలు వ్యయముతో స్మశాన వాటికి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

➡️