గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి 

Apr 8,2024 11:31 #East Godavari

ప్రజాశక్తి-కడియం : స్నేహితులతో గోదావరిలో స్నానానికి వెళ్లిన యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన బర్నికల అశోక్ కుమార్ (17) అనే యువకుడు మరోకొందరు స్నేహితులతో కలసి ధవళేశ్వరంలోని గోదావరికి ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు అశోక్ కుమార్ గోదావరిలో మునిగి మృత్యువాత పడ్డాడు.మృతదేహన్ని బయటకు తీసి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా వుండగా కొడుకు మృతి పట్ల నిరుపేదలైన తల్లి తండ్రులు అల్లాడిపోతున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే అశోక్ కుమార్ మృతదేహం ఆదివారం సాయంత్రం నుంచి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంది. త్వరగా పోస్టు మార్టం నిర్వహించి తమ కుమారుని మృతదేహాన్ని అప్పగించాలనివారు కోరుతున్నారు.

➡️