అంగన్వాడీ సమ్మెకు రైతు సంఘం మద్దతు 

Jan 5,2024 16:31 #East Godavari
anganwadi workers strike 25th day eg

ప్రజాశక్తి-చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు  తహసీల్దార్ కార్యాలయం వద్ద  అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధికసమ్మె శుక్రవార నాటికి 25వ రోజుకి చేరుకొంది. అంగన్వాడి కార్యకర్తలు మద్దతుగా రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘం మద్దతు తెలిపారు. జిల్లా రైతు సంఘం కన్వీనర్ గారపాటీ  వెంకట సుబ్బారావు మండల కౌలు  రైతు సంఘం అధ్యక్షుడు రామనాథ మురళీకృష్ణ అంగన్వాడి కార్యకర్తలకు మద్దతు తెలిపారు. పి విజయ కుమారి కే లక్ష్మి మాట్లాడుతూ  గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ, ఐసీడీఎస్ ప్రీస్కూల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి విజయ్ కుమారి కే లక్ష్మి కే దమయంతి ఏ శ్రీదేవి బి మహాలక్ష్మి ఎస్ అరుణ్ కుమారి అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు .

➡️