పెన్షన్‌ల కోసం లబ్ధిదారుల అవస్థలు

May 2,2024 21:29
పెన్షన్‌ల కోసం లబ్ధిదారుల అవస్థలు

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌, గోపాలపురం సామాజిక పెన్షన్లు తీసుకునే వృద్ధులు అవి తమ ఖాతాల్లో పడ్డాయో లేదో అని ఆందోళనలతో బ్యాంకులకు పోటెత్తుతున్నారు. ఒకవైపు భానుడి భగభగలు మరోవైపు పెద్దపెద్ద క్యూలు ఉండడంతో అసలే వద్ధులు కావడంతో ఎక్కువసేపు క్యూ లైన్‌లో నిలబడలేక ఒకవైపు వడగాలి వేడి తట్టుకోలేక నాన్న అవస్థలు పడుతున్నారు. ధవళేశ్వరం మేజర్‌ పంచాయితీ కావడంతో అధిక సంఖ్యలో సామాజిక పెన్షన్‌దారులు ఉండడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆంధ్ర బ్యాంక్‌ లాంటి బ్యాంకుల వద్ద లబ్ధిదారులు ఉదయం నుంచి పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు వారి ఎకౌంట్‌లో జమ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పినా నగదు బ్యాంకులో తమ ఎకౌంట్లో పడిందో లేదో అని ఆందోళనలతో లబ్ధిదారులు అందోళన చెందారు. గోపాలపురంలో పెన్షన్‌ కోసం బ్యాంకుల వద్దకు వృద్ధులు, వితంతువులు దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే చేరుకుని పడుగాపులు పడుతున్నారు. మండలంలోని పలు బ్యాంకుల వద్ద, మినీ బ్యాంకుల వద్ద వృద్ధులు పెన్షన్‌ కోసం ఎదురుచూపులు చూస్తూ వేసవి తాపాన్ని తట్టుకోలేక పడుతూ లేస్తూ ఎదురు చూస్తున్నామని తెలిపారు. పలు గ్రామాల నుండి బ్యాంకుల వద్దకు ఉదయాన్నే చేరుకున్నారు. వద్ధులు కావడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సుగర్‌ వ్యాధులు ఉన్న వారు బ్యాంకు ఉద్యోగులు వచ్చే సమయం కంటే ముందుగానే డబ్బులు కొరకు బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. పలువురికి నగదు జమ కాలేదని తెలపడం తీవ్ర ఆందోళన గురయ్యారు. దీనికి తోడు బ్యాంకుల వద్ద ఉన్న ఎటిఎంలు పని చేయకపోవడంతో అవస్థలు పడ్డారు.

➡️