రాజకీయాల్లో కృష్ణబాబుది ప్రత్యేక ముద్ర

May 26,2024 23:27
కృష్ణబాబు

ప్రజాశక్తి – కొవ్వూరురూరల్‌
కొవ్వూరు మాజీ ఎంఎల్‌ఎ, పారిశ్రామిక వేత్త పెండ్యాల కృష్ణబాబుకు పశ్చిమ గోదావరి జిల్లా రాజకియాల్లో ప్రతేక్యమైన ముద్ర ఉందని ఆరోగ్యశాఖ మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం దొమ్మేరులో కృష్ణబాబు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కృష్ణబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాస్‌చంద్రబోస్‌, ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఉమ్మడి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, తాడేపల్లిగూడెం టిడిపి ఇన్‌చార్జ్‌ వలవల మల్లికార్జునరావు, వైద్యులు డాక్టర్‌ జివి.కృష్ణారావు, డాక్టర్‌ సాంబశివరావు కృష్ణబాబు మృతికి సంతాపం తెలిపారు. కుటంబ సభ్యులైన పెండ్యాల అచ్చిబాబు, కృష్ణబాబు అల్లుడు ఎస్‌.రాజీవ్‌కృష్ణలను కలసి మృతికి సంతాపం తెలిపారు. వీరితో పాటుగా కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, అర్భన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణ, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

➡️