కాంగ్రెస్‌ అభ్యర్థి శివ గణేష్‌ ప్రచారం

May 2,2024 21:33
కాంగ్రెస్‌ అభ్యర్థి శివ గణేష్‌ ప్రచారం

ప్రజాశక్తి-గోకవరం మండలంలోని గోకవరం, తంటికొండ, గాదెలపాలెం, ఇటికాయలపల్లి, గోపాలపురం, అచ్యుతాపురం, గుమ్మళ్లదొడ్డి గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థి మరోతి శివ గణేష్‌ గురువారం ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ గణేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది హామీల గురించి వివరించారు. రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ, ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ.8,333, నిరుద్యోగులకు రూ.30 లక్షలు, రెండున్నర లక్షలు ఉద్యోగాల కల్పన, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400, రూ.ఐదు లక్షలతో పేదలకు గృహ నిర్మాణం, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్‌, వికలాంగులకు రూ.6 వేలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతులకు గిట్టుబాటు ధర, కెజి టు పిజి ఉచిత విద్య తదితర పథకాలను వివరించారు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని, కాంగ్రెస్‌ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివద్ధి సంక్షేమం సాధ్యమని తెలిపారు. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అభ్యర్థి ఎంఎం.పల్లం రాజు, తనకు హస్తం గుర్తుపై ఓటు ముద్రను వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు శ్రీవత్సవాయి సత్యనారాయణరాజు, డాక్టర్‌ నక్కా సత్యనారాయణ, గుర్రాల రత్నాజీరావు, బదిరెడ్డి ప్రసాద్‌, బొల్లం బాపిరాజు, కొండా శ్రీను, మాసారపు అప్పారావు, ఎగుపాటు మహేష్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

➡️