కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ముమ్మర ప్రచారం

May 3,2024 23:25

ప్రచారంలో జగ్గంపేట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శివగణేష్‌

ప్రజాశక్తి-యంత్రాంగం

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు శుక్రవారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. గోకవరం ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గోకవరం మండలంలోని వీర్లంక పల్లి, పెంటపల్లి, రంప ఎర్రంపాలెం, తిరుమల పాలెం, గంగంపాలెం, ఠాకూర్‌ పాలెం, మల్లవరం, జగన్నాధపురం, కామరాజుపేట, కొత్తపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఎ అభ్యర్థి మారోతి శివ గణేష్‌ పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ గణేష్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది హామీల గురించి వివరించారు. రెండు లక్షల రైతు రుణమాఫీ, ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ.8,333, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400, ఐదు లక్షలతో పేదలకు గహ నిర్మాణం, వద్ధులకు పెన్షన్‌ రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్య తదితర పథకాలను వివరించారు. మే 13న నిర్వహించబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీ గా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి మల్లిపూడి మంగపతి పల్లం రాజుకి, జగ్గంపేట ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీ చేసిన మరోతి శివ గణేష్‌ను అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీ వత్సవాయి సత్యనారాయణరాజు, డాక్టర్‌ నక్క సత్యనారాయణ, చంద్రమౌళి వెంకటరత్నం , గుర్రాల రత్నాజీరావు, బదిరెడ్డి ప్రసాద్‌, బొల్లం బాపిరాజు, కొండా శ్రీను, మాసారుపు అప్పారావు, ఎగుపాటు మహేష్‌ పాల్గొన్నారు. ముమ్మిడివరం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ తోనే అభివృద్ధి సాకారం అవుతుందని ముమ్మిడివరం నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాలేపు ధర్మారావు అన్నారు. మండల పరిధిలోని తానేలంక మరియు నగర పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు దివి వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఇంటింటా వెళ్లి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిహెచ్‌.బాలకృష్ణ, ఎం.రాజశేఖర్‌ లతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గోన్నారు. గోపాలపురం నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సోడాదాసి మార్టిన్‌ లూథర్‌ ఎన్నికల ప్రచారం మండలంలో శుక్రవారం పర్యటించారు. మండలంలోని సాగిపాడు, దొండపూడి, హుకంపేట, గంగోలు, రాంపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశం, రాష్ట్రం భవిష్యత్తు కొరకు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్‌ పార్టీతోనే అభివద్ధి సాధ్యమని అన్నారు. గోపాలపురం నియోజకవర్గం అభివద్ధి కషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పిసిసి ప్రధానకార్యదర్శి జ్యేష్ట సతీష్‌ బాబు, మండల కాంగ్రెస్‌ అద్యక్షుడు మట్టపర్తి రామ్మోహనరావు, గన్నిన రామారాయుడు, వేగివాడ నాగేశ్వరరావు, సుంకర సత్యనారాయణ, కౌలురి బాబాజిరావు, గుత్తికొండ సూరి బాబు, కుంకాలా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️