మంత్రి వనిత సమక్షంలో పలువురు పార్టీలో చేరిక

Apr 6,2024 23:19
మంత్రి వనిత సమక్షంలో పలువురు పార్టీలో చేరిక

ప్రజాశక్తి -దేవరపల్లిదుద్దుకూరులో హోమ్‌ మంత్రి, వైసిపి గోపాలపురం అభ్యర్థి తానేటి వనిత సమక్షంలో వివిధ పార్టీల నుంచి పలువురు వైసిపిలో చేరారు. మంత్రి వనిత వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్‌ రెడ్డి కష్టనష్టాల్లో అండదండలుగా ఉంటున్నారని నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో పలువురు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రజలు వైసిపి పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసిపి గ్రామ అధ్యక్షుడు కాండ్రు రామకష్ణ దంపతులు మంత్రి వనితను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు కూచిపూడి సతీష్‌, కొడవటి బుజ్జిబాబు, బాబు గౌడ్‌, బుల్లెట్‌ పోసి, పంది పేరయ్య, మల్లిపూడి రాంబాబు, వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️